VD-12: మీ తిట్లు వినలేక అతన్ని చాలా హింస పెట్టా, ఫైనల్‌గా టైటిల్ ఫిక్స్ చేశాము.. నాగవంశీ(ట్వీట్)
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘VD-12’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi) నిర్మిస్తున్నారు. ఇక ఇందులో యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే(Bhagyasri Bhorse) హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా నుంచి అనౌన్స్‌మెంట్ పోస్టర్ తప్ప మరే అప్డేట్ రాలేదు. దీంతో మరో అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా నాగ వంశీ తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అందులో ‘మీ అందరి అబ్యూసెస్ తర్వాత నేను గౌతమ్‌ని చాలా హింస పెట్టాక ఫైనల్లీ మేము VD-12 టైటిల్‌ను ఫిక్స్ చేశాము. త్వరలోనే దీన్ని వెల్లడిస్తాము’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మూవీకి టైటిల్ ఏమని పెడతారా అని విజయ్ ఫ్యాన్స్ బాగా క్యూరియాసిటీతో ఉన్నారు.
కాగా విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’(Arjun Reddy) మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ ‘ఫ్యామిలీ స్టార్’(Family Star) సినిమాలో నటించినప్పటికీ ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఇక అతని పర్సనల్ విషయానికి వస్తే ‘డియర్ కామ్రేడ్’(dear Comrade), ‘గీత గోవిందం’(Geetha Govindam) వంటి సినిమాల్లో తనకు జంటగా నటించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna)తో ప్రేమలో పడ్డాడు. ఆమెతో వేకషన్స్‌కు వెళుతూ చాలా సార్లు మీడియాకు కూడా చిక్కారు ఈ జంట. అయితే దీనిపై వీరిద్దరూ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.