వరుణ్- లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్.. బ్యాచిలర్ పార్టీ ఎక్కడ జరిగిందంటే?
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్న సంగతి తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు పెద్దలను ఒప్పించి మరీ ఈ ఏడాది జూన్‌లో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఆగస్ట్‌లో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ పలు కారణాల వల్ల క్యాన్సిల్ అయింది.
తాజాగా, మరోసారి వరుణ్-లావణ్య పెళ్లి డేట్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో కానుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా మెగా హీరో బ్యాచిలర్ పార్టీ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. తాము మొదట కలిసిన చోట ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. అయితే వివాహానికి సంబంధించిన షాపింగ్‌ను వీరిద్దరు షురూ చేశారు. అలాగే వరుణ్ స్పెయిన్‌లో తన ఫ్రెండ్స్‌కు బ్యాచిలర్ పార్టీ ఆరేంజ్ చేశాడట. 40 మంది స్నేహితులు, మెగా హీరోల్లో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా వెళ్లినట్లు టాక్. అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్లు పెళ్లి కూడా అక్కడే జరుగుతుందా? ఇటలీలోనా అని చర్చించుకుంటున్నారు.