టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టికి ఆ ఫోబియా.. అందుకే సినిమాలు చేయడం లేదా?
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏజెంట్ సాయి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏజెంట్ సాయి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చిచోర అనే మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. ఈ రెండు చిత్రాలు భారీ హిట్ అందుకున్నాయి. ఇక నవీన్ 2021లో అనుదీప్ డైరెక్షన్‌లో జాతి రత్నాలు మూవీతో తెలుగు ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించాడు. ఈ చిత్రంతో నవీన్ పోలిశెట్టి క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇక గత ఏడాది అనుష్క శెట్టితో ఈ యంగ్ హీరో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీలో నటించాడు. అయితే ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ అప్పటి నుంచి ఏ సినిమా ప్రకటించకుండా నవీన్ అమెరికాలో సెటిల్ అయినట్లు టాక్.
ఇదిలా ఉంటే.. తాజాగా, నవీన్ పొలిశెట్టికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనకు ఫెల్యూర్ ఫోబియా ఉందని సన్నిహితుల ద్వారా బయటకు రావడంతో ఈ విషయం తెలిసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఏ సినిమా చేసిన హిట్ కొట్టాల్సిందే లేదంటే సినీ కెరీర్ ముగిసిపోతుందన్న భయంతో జీవిస్తున్నాడట. అందుకే ఎంతోమంది డైరెక్టర్లు నవీన్ పొలిశెట్టికి కథ వినిపించినా కానీ ఆయన ఒకే చేయకుండా అమెరికాలో ఉంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ భయాన్ని వదిలి సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టికి సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.