Prabhas: ఆ ఇద్దరు ప్రపంచవ్యాప్తంగా తుఫాను సృష్టించబోతున్నారు.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘L2:ఎంపురాన్’.

Update: 2025-03-21 09:19 GMT
Prabhas: ఆ ఇద్దరు ప్రపంచవ్యాప్తంగా తుఫాను సృష్టించబోతున్నారు.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
  • whatsapp icon

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘L2:ఎంపురాన్’. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ‘లూసిఫర్’ చిత్రానికి సిక్వెల్‌గా రాబోతుంది. అయితే ఈ మూవీలో టోవినో థామస్(Tovino Thomas), సూరజ్ వెంజరమూడు. ఇంద్రజిత్, మంజు వారియర్ (Manju Warrier)కీలక పాత్రలో కనిపించనున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్(Saikumar), బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుభాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ‘ఎంపురాన్’ మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని మార్చి 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కాబోతున్న మొట్టమొదటి మలయాళ మూవీగా 'లూసిఫర్‌ 2' నిలవబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్‌ను విడుదల చేస్తున్నారు.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేయగా.. అందరినీ మెస్మరైజ్ చేసింది. నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా మంత్రముగ్దులయ్యారనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా, ‘L2: ఎంపురాన్’ట్రైలర్‌పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. 'మాగ్నమ్ ఓపస్ 'L2: ఎంపురాన్' ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. వన్ అండ్ ఓన్లీ మోహన్ లాల్, నా వరదా పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి 2025 మార్చి 27 నుండి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో తుఫాను సృష్టించబోతున్నారు'' అని రాసుకొచ్చారు.



 


Tags:    

Similar News

Rakul Preet Singh