న్యూ జర్నీ ఎగ్జైంటింగ్‌గా ఉందని ఆ వీడియో షేర్ చేసిన యంగ్ బ్యూటీ.. సీతామహాలక్ష్మిలా ఉన్నావంటూ కామెంట్స్(పోస్ట్)

‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2024-12-12 04:52 GMT

దిశ, సినిమా: ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్స్ తలుపు తట్టాయి. అలా వచ్చిన చిత్రాలన్నిటిలో నటించి మెప్పించింది. అయితే చివరగా నటించిన సినిమాలు అంతగా మెప్పించలేక పోయాయి. దీంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. అయితే సినిమాల్లో ట్రెడిషనల్ వేర్‌లో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ నెట్టింట మాత్రం హాట్ హాట్ ఫొటోలతో యూత్‌కి పిచ్చేక్కిస్తోంది. ఈ క్రమంలో ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా మృణాల్ తన ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో పెళ్లి కూతురి గెటప్‌లో కుందనపు బొమ్మలా రెడీ అయ్యింది. అసలు ఆ వీడియో చూస్తే నిజంగానే ఈ భామ పెళ్లి చేసుకుంటుందేమో అని అన్నంతగా రెడీ అయ్యింది. అలాగే ఈ వీడియోకి ‘న్యూ జర్నీ ఎగ్జైంటింగ్‌గా ఉంది’ అని క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సీతామహాలక్ష్మిలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ వీడియోలో మృణాల్ కాంచీవరం శారీస్ సంబంధించిన ప్రమోషన్స్ చేసినట్లు తెలుస్తోంది.

Full View

Tags:    

Similar News