STAR HEROIN: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. డెలివరీ అయ్యేది ఆ రోజే..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, వెబ్డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు రీసెంట్గా వచ్చిన కల్కీ మువీలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నది. ఇక ఈ బ్యూటీ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ను ప్రేమించి పెళ్లాడింది. అయితే ప్రస్తుతం ఈమె ప్రగ్నెంట్గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈమె డెలివరీ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ నెల 28న తన మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం. ముబైంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె ప్రసవించనున్నట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.