Sai Dharam Tej: మెగా హీరోకు నోటీసులు పంపిన పోలీసులు.. కారణం అదేనా?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2025-03-24 04:08 GMT
Sai Dharam Tej: మెగా హీరోకు  నోటీసులు పంపిన పోలీసులు.. కారణం అదేనా?
  • whatsapp icon

దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు చిత్రాల్లో నటించిన ఆయన ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే వరుస చిత్రాలతో దూసుకుపోతున్న క్రమంలోనే ఆయనకు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే.

దీంతో కొద్ది కాలంపాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు. మళ్లీ ‘వీరూపాక్ష’ మూవీ ద్వారా రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’(Sambarala yeti gattu)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాకంటే ముందు సాయి ధరమ్ తేజ్ ‘గాంజా శంకర్’(Ganja Shankar)చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఏడాది కావొస్తున్నా గాంజా శంకర్‌ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. దీంతో పలు పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే.. ఏదో ఇష్యూ కావడంతో మొత్తం ఆ సినిమానే నిలిపివేశారు. తాజాగా, ఈ విషయంపై డైరెక్టర్ సంపత్ నంది రియాక్ట్ అయ్యారు. ‘‘సాయి ధరమ్ తేజ్‌తో చేయాలనుకున్న గాంజా శంకర్‌ను నిలిపివేశాము. టైటిట్ మార్చుకోమని హీరోకు, నిర్మాత నాగవంశీ(Naga Vamsi)కి నాకు పోలీసులు నోటీసులు పంపించారు. అయితే పేరు మార్చడం కంటే సినిమానే అపివేయడం మంచిదనే ఉద్దేశంతో గాంజా శంకర్‌ను నిలిపివేశాము. ముందు ఓ కథ రాసుకుని టైటిల్ ఫిక్స్ అయ్యాక మార్చమంటే మళ్లీ స్టోరీని కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. అందుకే ఇవన్నీ వద్దని భావించాము’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సంపత్ నంది(Sampath Nandi) కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Read More..

‘అదిదా సర్‌ప్రైజు’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన వార్నర్.. నీ యవ్వ తగ్గేదేలే అంటూ కామెంట్స్.. వీడియో వైరల్  

Tags:    

Similar News

Monami Ghosh