ఆ సినిమా అలా అవ్వడంతో తీసుకున్న రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన నేచురల్ బ్యూటీ..?
నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘ఫిదా’, ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, ‘పడి పడి లేచే మనసు’, ‘ఎన్.జి.కె’, ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘విరాట పర్వం’, ‘గార్గి’, ‘అమరన్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘ఫిదా’, ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, ‘పడి పడి లేచే మనసు’, ‘ఎన్.జి.కె’, ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘విరాట పర్వం’, ‘గార్గి’, ‘అమరన్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అంతే కాకుండా సినిమాల్లో మినిమల్ మేకప్ వేసుకోవడం, బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేయకపోవడం వంటి వాటితో ఇంకా ఫేమ్ అయింది. ఇక ఈ ముద్దుగుమ్మ డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ప్రస్తుతం సాయి పల్లవి ‘తండేల్’ సినిమాతో పాటు ‘రామాయణం’ మూవీలో నటిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈమెకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..
శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన పడి పడి లేచే మనసు అనే సినిమా 2018లో విడుదలైన సంగతి తెలిసిందే. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ పాటలు పరంగా హిట్ అయినా స్టోరీ పరంగా మాత్రం అనుకున్నంతగా విజయం సాధించలేదు. అయితే ఈ మూవీ థియేటర్ల వద్ద నిరాశపరచడంతో సాయి పల్లవి తను సైన్ చేసిన రెమ్యూనరేషన్ మొత్తాన్ని నిర్మాతల నుంచి తీసుకోవడానికి అంగీకరించలేదట. దీంతో 40 లక్షలు త్యాగం చేసి, తన వైపు నుంచి నిర్మాతలకు అండగా నిలిచిందనే న్యూస్ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక దీనిపై సాయి పల్లవి ఎలా స్పందిస్తుందో చూడాలి.