తెలుగింటి అందం ‘భైరవం’ నుంచి నటి మెస్మరైజింగ్ లుక్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Sai Srinivas), మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohit) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘భైరవం’(Bhairavam ).

Update: 2024-12-10 08:09 GMT
తెలుగింటి అందం ‘భైరవం’ నుంచి నటి మెస్మరైజింగ్ లుక్ రిలీజ్
  • whatsapp icon

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Sai Srinivas), మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohit) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘భైరవం’(Bhairavam ). మల్టీ స్టారర్‌గా వస్తున్న ఈ సినిమాకు విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని శ్రీసత్యసాయి ఆర్ట్స్(Sri Sathya Sai Arts) బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రియమణి(Priyamani) కీలక పాత్రలో కనిపించనుంది. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ నటీనటులకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు.

వారి పాత్రలు రివీల్ చేస్తున్న ఫస్ట్ లుక్‌లు నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే సాయి శ్రీనివాస్, అతిధి శంకర్, నారా రోహిత్, మంచు మనోజ్, ఆనంది పాత్రలు విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్‌‌ను దక్కించుకున్నాయి. నేడు నటి ఆనంది(Anandhi) పుట్టిన రోజు కావడంతో మరో లుక్‌ను విడుదల చేశారు. తెలుగింటి అందం ‘నీలిమ’ (Neelima)గా నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో ఆమె అచ్చ తెలుగు ఆడపడుచులా మెరిసిపోతూ కనిపించింది. ఇక ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు వావ్ సూర్ అంటున్నారు.

Tags:    

Similar News