బేబీ బంప్‌తో దర్శనమిచ్చిన హీరోయిన్.. వీడియో వైరల్

టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి గత కొంత కాలం పాటు డేటింగ్‌లో ఉండి 2023లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-12-30 05:47 GMT

దిశ, సినిమా: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి గత కొంత కాలం పాటు డేటింగ్‌లో ఉండి 2023లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అతియా ప్రగ్నెంట్‌గా ఉంది. ఇక త్వరలోనే వీరు తల్లి తండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఈ జంట వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ బుల్లి రాహుల్ ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అతియా శెట్టికి సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో కేఎల్ రాహుల్ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా అతియా కూడా మెల్ బోర్న్ స్టేడియంలో కనిపించింది. ఆమెతో పాటు విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి ఫాదర్ కూడా కనిపించారు. అయితే అతియా శెట్టి బేబీ బంప్‌తో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News