Thalapathy69 : దలపతి విజయ్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్.. ఫస్ట్ లుక్‌ పోస్టర్ రిలీజ్

కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో విజయ్ దలపతి (Thalapathy Vijay) నటిస్తున్న తాజా చిత్రం ‘విజయ్-69’ (Vijay-69).

Update: 2025-01-26 06:49 GMT
Thalapathy69 : దలపతి విజయ్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్.. ఫస్ట్ లుక్‌ పోస్టర్ రిలీజ్
  • whatsapp icon

దిశ, సినిమా: కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో విజయ్ దలపతి (Thalapathy Vijay) నటిస్తున్న తాజా చిత్రం ‘విజయ్-69’ (Vijay-69). ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్​ (project) నుంచి రిపబ్లిక్ డే (Republic Day) స్పెషల్‌గా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ (First look) పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘జన నాయగన్’ (తెలుగులో జన నాయకుడు) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్.. స్టైలిష్‌గా నిలబడి సెల్ఫీ తీస్తుండగా వెనుక ప్రజలు అతడికి జేజేలు కొడుతున్నట్లు కనిపిస్తున్నారు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా.. డైరెక్టర్ హెచ్ వినోథ్ (H. Vinoth) తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్దే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీ డియోల్ (Bobby Deol), యంగ్ బ్యూటీ మమిత బైజు (Mamita Baiju), ప్రియమణి (Priyamani), ప్రకాశ్ రాజ్ (Prakash Raj) తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నటిస్తున్న నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్‌లు రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

Tags:    

Similar News