Shivaraj Kumar: క్యాన్సర్ నుంచి కోలుకున్న స్టార్ హీరో.. వీడియో విడుదల చేయడంతో ఖుషీలో ఫ్యాన్స్

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Shivaraj Kumar) గత కొద్ది కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే.

Update: 2025-01-01 09:56 GMT

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Shivaraj Kumar) గత కొద్ది కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయన ఓ వైపు ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల శివరాజ్ కుమార్ ఘోస్ట్, జైలర్(Jailer), రంగల్(Rangal) వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.

కానీ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు చికిత్స తీసుకునేందుకు అమెరికా(America) వెళ్లినట్లు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, శివరాజ్ కుమార్ నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు. ఆయనకు క్యాన్సర్-ఫ్రీ రిపోర్ట్ వచ్చిందని ట్విట్టర్ ద్వారా వీడియోను షేర్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత ఎవరికైనా భయం ఉంటుంది. ఆ భయం దూరం చేసేందుకు నా భార్య గీత, అభిమానులు ఎంతో సహకరించారు. వారందరికీ రుణపడి ఉంటా. నేను పూర్తి చేయాల్సిన సినిమాల కోసం ఎంతో కష్టపడ్డాను. కీమో థెరపీ చేయించుకుంటూనే ‘45’ మూవీ షూటింగ్ పూర్తి చేశా. ఈ ప్రయాణంలో వైద్యులు అందించిన సహకారం మర్చిపోలేను’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకుంటున్నారు.

Read More ...

Kavya - Nikhil: బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ .. కావ్య ను అంతలా బాధ పెట్టాడా.. విలన్ అంటూ గుండెల్లో గట్టిగానే గుచ్...


Tags:    

Similar News