Sreeleela: క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తున్న యంగ్ బ్యూటీ.. ఫొటోలు వైరల్
‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, వెబ్‌డెస్క్: ‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది ఈ భామ. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
రీసెంట్ సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో అల్లు అర్జున్(allu Arjun) హీరోగా, రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించిన పుష్ప-2(Pushpa-2) మూవీలో శ్రీలీల ‘కిస్సిక్’(Kissik) అనే ఐటెం సాంగ్‌లో చిందులేసింది. ఆ బ్యూటీ డాన్స్‌కి ఫుల్ మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. నితిన్(Nithin) సరసన ‘రాబిన్ హుడ్’(Robbin Hood), రవితేజ(Raviteja) ‘మాస్ జాతర’, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న ‘VD-12’, శివ కార్తికేయన్(Sivakarthikeyan) ‘పరాశక్తి’(Parasakthi) మూవీతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan) సరసన ఓ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది.
అయితే రాబిన్ హుడ్ సినిమా మార్చి 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా రాజమహేంద్రవరంలోని పలు కాలేజీలకు వెళ్లారు ఈ మూవీ టీమ్. అయితే ఈ ప్రమోషన్స్‌కి శ్రీలీల.. బ్లాక్ జర్కిన్ టీషర్ట్ వేసుకుంది. అయితే దానిపై రాబిన్ హుడ్ అనే రాసి ఉండటం విశేషం. అయితే అక్కడ స్టూడెంట్స్‌తో ముచ్చటించిన ఈ బ్యూటీ ఫొటోస్‌ను మైత్రీ మూవీ మేకర్స్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ పిక్స్‌లో శ్రీలీల క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తుంది. దీంతో ఈ ఫొటోలు కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు క్వీన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.