పెళ్లికి ముందే ఆ సింగర్‌కు ప్రెగ్నెన్నీ.. బుద్ధుండాలి కదా? : ఇన్‌ఫ్లుయన్సర్
దిశ, సినిమా : సింగర్ అండ్ ఫ్యాషనిస్టా రిహాన్నా.. ర్యాపర్ రాకీతో కలిసి ఫస్ట్ బేబీకి వెల్‌కమ్ చెప్పబోతోంది. అయితే ఈ విషయాన్ని అభిమానులు సెలబ్రేట్ చేసుకోవడంపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్ డానియల్ రేఘా కాంట్రవర్షియల్ ట్వీట్ చేశాడు. పెళ్లికి ముందే గర్భం దాల్చడమనేది పొగడ్తలు కురిపించేంత విలువైన విషయం కాదన్నాడు. సెలబ్రిటీ అయినా, కాకపోయినా పిల్లలు పుట్టకముందే పెళ్లి చేసుకోవడం సరైన పని కానీ వరల్డ్ మాత్రం 'బేబీ మా అండ్ బేబీ డాడీ' పదాలను నార్మలైజ్ చేస్తోందని అన్నాడు.
ఈ విషయంలో మనకు దేవుడే హెల్ప్ చేయాలన్న రేఘ.. వివాహానికి ముందు తాను గర్భం దాల్చేందుకు ఓ వ్యక్తిని అనుమతిస్తుందంటే ఆ మహిళకు తన విలువ తనకు తెలియనట్లే అన్నాడు. ఇది పూర్తిగా సెన్స్‌లెస్ పని అని కామెంట్ చేశాడు. నిజంగా ఓ వ్యక్తి ఎవరైనా మహిళను ప్రేమించినట్లయితే 'బేబీ మా' అనే స్టేటస్ ఇచ్చే బదులు.. ఎదురు కట్నమిచ్చి పెళ్లి చేసుకోవాలని, ఆ తర్వాతే కుటుంబాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డాడు.
కాగా దీనిపై స్పందించిన ఫ్యాన్స్.. 'నిన్నెవరు అడిగారు ఇప్పుడు. రిహాన్నాకు ఆల్రెడీ 30 ఏళ్లు. ఏం చేయాలో ఏం చేయకూడదో తనకు తెలుసు. అయినా మేరీ మాత గర్భవతి కాకముందే వివాహం చేసుకుందా? మీరేమీ స్వర్గానికి ద్వారపాలకులు కాదు. మీకు నచ్చినట్లుగా మీ లైఫ్‌ను పర్‌ఫెక్ట్‌గా ఉంచుకోండి. అంతేకానీ ఇతరులను కించపరచకండి' అని కామెంట్ చేస్తున్నారు.
https://twitter.com/DanielRegha/status/1488217448029560839?s=20&t=FKSPwPFNq6Rayixd8Ui9_w