దుమారం రేపుతున్న న్యూస్.. ఇండస్ట్రీలో ఆ ముగ్గురు సూసైడ్ చేసుకోబోతున్నారంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి(Venu Swamy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి(Venu Swamy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన నిత్యం రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే గతంలో చెప్పిన జాతకాలు ఎవ్వరూ నమ్మనప్పటికీ సమంత(Samantha), నాగచైతన్య విడిపోతారని చెప్పిన మాటలు నిజం కావడంతో అంతా అప్పటి నుంచి నమ్మడం మొదలెట్టారు. అయితే ఇటీవల వేణు స్వామి నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Shobitha Dhulipala) రెండో పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదం అయిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా ఈ విషయం మహిళ కమీషన్ సీరియస్ అయి వేణు స్వామిపై కేసు కూడా పెట్టారు. దీంతో వేణు స్వామి ఇక నుంచి సెలబ్రిటీల జాతకాలు చెప్పను అని ఓ సంచలన స్టేట్‌మెంట్ వదిలారు. ఇక అప్పటినుంచి సైలెంట్‌గానే ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, వేణు స్వామి ఓ ముగ్గురు సెలబ్రిటీలు సూసైడ్ చేసుకుని చనిపోతారని చెప్పిన ఆడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే దానికి కారణాలు మాత్రం సినిమాలు పోస్ట్ పోన్ కావడం, అవకాశాలు రాకపోవడమే అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట దుమారం రేపుతోంది.
మరో వివాదాస్పద వ్యాఖ్యలు వేణు స్వామి
— Milagro Movies (@MilagroMovies) March 21, 2025
ప్రభాస్ ...విజయ్ దేవరకొండ సమంత... వీళ్ళు సూసైడ్ చేసుకోబోతున్నారు #Prabhas #VijayDeverakonda#Samanthapic.twitter.com/6sWan1o7Bn