Saripoda Sanivaram: నాని సరిపోదా శనివారం ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’.

Update: 2024-08-30 09:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా.. గురువారం రిలీజైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి మిక్సడ్ టాక్ వస్తోంది. అయినా ముందు నుంచి ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండటంతో కలెక్షన్స్ భారీగా వచ్చాయని తెలుస్తుంది. నాని కెరీర్‌లో అత్యధికంగా దసరా సినిమా మొదటి రోజు 38 కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా దానికంటే తక్కువే కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇంకా DVV ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా కలెక్షన్స్ అనౌన్స్ చేయకపోయినా సినీ ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం వైరల్ అవుతుంది.

సరిపోదా శనివారం సినిమా మొదటి రోజు తెలుగులో ఆల్మోస్ట్ 9 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందట. అలాగే ఇండియాలోని మిగిలిన ప్రాంతాల్లో 4 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో 7 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సమాచారం. మొత్తంగా సరిపోదా శనివారం సినిమా మొదటి రోజు 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం, వీకెండ్ ఉండటం కలిసొచ్చి ఈ సినిమాకు కలెక్షన్స్ మరింత పెరిగి 100 కోట్లు రీచ్ అవుతుందేమో చూడాలి.


Similar News