Kanguva: రిలీజ్‌కు ముందే సీక్వెల్‌పై సన్నాహాలు.. సినిమాపై హైప్ పెంచేస్తున్న మూవీ టీమ్
స్టార్ హీరో సూర్య (Surya), దిశ పటానీ (Disha Patani) కాంబినేషన్‌లో వస్తున్న తాజా మూవీ ‘కంగువ’ (Kanguva).
దిశ, సినిమా: స్టార్ హీరో సూర్య (Surya), దిశ పటానీ (Disha Patani) కాంబినేషన్‌లో వస్తున్న తాజా మూవీ ‘కంగువ’ (Kanguva). పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ (Shiva) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో బాబీ దేవోల్ (Bobby Deol) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్ (Studio Green), యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం (Movie Unit) . ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ (Interview) లో పాల్గొన్న నిర్మాత కేఈ జ్ఞానవేల్ (KE Gnanavel).. ‘కంగువ’ సీక్వెల్‌పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు.
‘శివ దర్శకత్వాన్ని ఆడియన్స్ (audience) ఆదరిస్తారనే నమ్మకం ఉంది. దీని స్క్రిప్ట్ (script) రాసుకున్నప్పుడే రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నాం. రెండో భాగంలో ఉధ్రన్ పాత్ర (బాబీ దేవోల్) మరింత వివరణాత్మంగా ఉంటుంది. ‘కంగువ 2’ ప్రీ ప్రొడక్షన్ (Pre-production) పనులు వచ్చే ఏడాది (next year) ప్రారంభమవుతాయి. 2026లో షూటింగ్ (shooting) పూర్తి చేసి.. 2027లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. అంతే కాదు ఈ సీక్వెల్‌కు మాత్రం ఎవరూ పోటీ రాలేరు. కంటెంట్ అంత బలమైనది’ అని నిర్మాత చెప్పుకొచ్చారు.