Samantha: హ్యాపీ హాలిడేస్ అంటూ సమంత పోస్ట్.. టేక్ కేర్ సామ్ అంటున్న నెటిజన్లు
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత మయోసైటీస్ వ్యాధి బారిన పడి గత ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉంటూ రీసెంట్‌గా ‘సిటాడెల్ : హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌తో మనముందుకు వచ్చింది.
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత మయోసైటీస్ వ్యాధి బారిన పడి గత ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉంటూ రీసెంట్‌గా ‘సిటాడెల్ : హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌తో మనముందుకు వచ్చింది. ఈ సిరీస్‌లో సామ్ నటనకు ఫుల్ మార్కులే పడ్డాయి. ఇక డివోర్స్ తర్వాత సమంత మాజీ భర్త నాగ చైతన్య స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళను రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ, సమంత మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హెల్త్ అప్‌డేట్స్, వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఈ క్రమంలో సమంత పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సామ్ తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. బెడ్ పై పడుకున్న ఫొటోస్ షేర్ చేస్తూ.. ‘హ్యీపీ హాలీడేస్’ అనే క్యాప్షన్‌ను జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అయ్యో సమంతకు ఏం అయింది చాలా డల్‌గా కనిపిస్తుంది, ఇంకా మయోసైటీస్ తగ్గలేదా, టేక్ కేర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సమంత ఫొటోస్‌లో చాలా డల్‌గా కనిపించినదాన్ని బట్టి చూస్తే ఆమెకి ఇంకా ఆ వ్యాధి క్యూర్ కానట్టే తెలుస్తోంది.