నాగచైతన్యను మిస్ అవుతున్న సమంత..? ఇన్‌స్టాలో మళ్లీ ప్రత్యక్షమైన పెళ్లి ఫొటో
సమంత, నాగచైతన్య ‘ఏమాయ చేసావే’ సినిమా చేసిన తర్వాత ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: సమంత, నాగచైతన్య ‘ఏమాయ చేసావే’ సినిమా చేసిన తర్వాత ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. సమంత క్రిస్టియన్ అయినా, నాగచైతన్య హిందూ అయినా కూడా వారి మతాలు వారి ప్రేమకు అడ్డురాలేదు. ముందుగా క్రిస్టియన్ పద్ధతిలో, ఆ తర్వాత హిందూ పద్ధతిలో రెండు విధాలుగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏవో కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే సమంత ఆ తర్వాత తన ఇన్స్టాగ్రామ్లోంచి పెళ్లి ఫొటోలను బయటకు కనిపించకుండా Archive లో పెట్టింది. ప్రస్తుతం సామ్- చై ఎవరి కెరీర్ వాళ్లు చూసుకుంటూ వరుస చిత్రాల్లో నటిస్తున్నారు.
ఈ క్రమంలో విజయ్ దేవరకొండతో సమంత కలిసి నటించిన ‘ఖుషి’ మూవీ మంచి హిట్ టాక్‌ను అందుకుంది. కలెక్షన్స్ విషయంలో కూడా పరవాలేదనిపించింది. నాగచైతన్య మాత్రం ఇంకా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో సమంత ఇన్స్టాగ్రామ్ పేజీలో పెళ్లి ఫోటో ఒకటి ప్రత్యక్షమైంది. అందులో క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకుని సామ్, చైకి ఘాటుగా ముద్దు పెడుతోంది. దీంతో అది చూసిన నెటిజన్లు సామ్, చై ని మిస్ అవుతుందని అందుకే పెళ్లి ఫొటోను మళ్లీ అచీవ్ నుంచి తీసేసిందని అనుకుంటున్నారు.