Samantha: 'నేనేమి ఏడ్వటం లేదు, ఓకే'.. ఆ స్టార్ హీరో సాంగ్‌తో సమంత ఎమోషనల్ పోస్ట్
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో పడింది.
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న చై, సామ్‌లు ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ పట్టుమని నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు. డివోర్స్ తర్వాత సమంత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడింది. దీంతో ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉంటూ రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే.. స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళను డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా సమంత తన ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో అల్లు అర్జున్ నిన్న జైలు నుంచి రిలీజ్ అయి ఇంటికి వచ్చినప్పుడు తన భార్య అల్లు స్నేహారెడ్డి ఏ విధంగా ఎమోషనల్ అయిందో చూపిస్తూ దానికి ‘చూసేటి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అనే ‘పుష్ప’ సినిమాలోని సాంగ్‌ని యాడ్ చేసింది. ఇక ఈ వీడియోకి ‘నేనేమి ఏడ్వటం లేదు, ఐ యామ్ ఓకే’ అనే క్యాప్షన్‌ను జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.