Pranaya Godari: రిలీజ్‌కు రెడీ అయిన సాయి కుమార్ ‘ప్రణయగోదారి’..

సదన్, ప్రియాంక జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రణయగోదారి’ (Pranaya Godari).

Update: 2024-11-29 15:06 GMT
Pranaya Godari: రిలీజ్‌కు రెడీ అయిన సాయి కుమార్ ‘ప్రణయగోదారి’..
  • whatsapp icon

దిశ, సినిమా: సదన్, ప్రియాంక జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రణయగోదారి’ (Pranaya Godari). విలేజ్ డ్రామాగా రాబోతోన్న ఈ సినిమాను పిఎల్ విఘ్నేష్ (PL Vignesh) దర్శకత్వం వహించగా.. పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌‌ను మేకర్లు ప్రకటించారు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ ఆడియెన్స్ (audience)ను ఆకట్టుకుంది. అలాగే సాంగ్స్‌కు, పోస్టర్‌లకు సోషల్ మీడియా (Social Media)లో విశేషస్పందన లభించింది.

ఈ క్రమంలోనే తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు చిత్ర బృందం. ‘ప్రణయగోదారి’ చిత్రం డిసెంబర్ (December) 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక రిలీజ్ సమయం దగ్గరలోనే ఉండటంతో ప్రమోషన్ (promotion) కార్యక్రమాల్లో స్పీడు పెంచనున్నారు మేకర్స్. మున్ముందు మరింత కంటెంట్‌తో ఆడియెన్స్‌లో హైప్ పెంచేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా.. ఈ చిత్రంలో సాయి కుమార్ (Sai Kumar) అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

Tags:    

Similar News