Ravi Teja: రవితేజ ‘మాస్ జాతర’ మూవీ టీజర్ వచ్చేది ఆ స్పెషల్ డే నాడే!

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) ఇటీవల ఈగల్, మిస్టర్ బచ్చన్(Mr. Bachchan), సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Update: 2024-12-25 12:14 GMT

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) ఇటీవల ఈగల్, మిస్టర్ బచ్చన్(Mr. Bachchan), సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ హిట్ అందుకోలేకపోయారు. ఆ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని భాను భోగ వరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వంలో ‘మాస్ జాతర’(Mass Jatara) సినిమా చేస్తున్నాడు. దీనిని బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments), ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్య దేవర నాగవంశీ(Naga Vamsi), సాయి సౌజన్య నిర్మిస్తు్న్నారు. అయితే ఇందులో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తుంది.

రవితేజ 75వ చిత్రంగా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది మే9న థియేటర్స్‌లో విడుదల కానుంది. అయితే మాస్ జాతరకు  సంబంధించిన ఫస్ట్ లుక్(First Look) తప్ప మరే అప్డేట్ విడుదల కాలేదు. దీంతో మాస్ మహారాజా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ‘మాస్ జాతర’ మూవీకి సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. జనవరి 26న రవితేజ(Ravi Teja) పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ (Teaser)విడుదల కాబోతున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

Tags:    

Similar News