కూతురు వయసున్న హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్న రవితేజ..?
మాస్ మాహా రాజా రవితేజ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు.
దిశ, వెబ్‌డెస్క్: మాస్ మాహా రాజా రవితేజ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. చిన్న హీరోగా పరిచయం అయి పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. అయితే రవితేజ హీరోగా ఇటీవల వచ్చిన ధమాకా సినిమా బాక్సాఫీసును బద్దలు కొట్టింది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ కలెక్షన్స్‌లో రూ. 100 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా, రవితేజకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
రవితేజకు పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ తన కూతురు వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారని ఒక వార్త వైరల్ అవుతోంది. ధమాకాలో రవితేజతో కలిసి శ్రీలీల నటించింది. అయితే ఈ సినిమాలో నటించే సమయంలోనే రవితేజ కి శ్రీలీల తో ఉన్న మంచి బాండింగ్ తో నన్ను పెళ్లి చేసుకుంటావా అని శ్రీలీలను అడిగారట. అయితే ఇది కేవలం రవితేజ ఫన్నీ గానే శ్రీలీలను అలా అడిగారట. అంతే కానీ వేరే ఉద్దేశంతో మాత్రం కాదు అని తెలుస్తుంది. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ విషయం తెలిసిన కొందరు అలాంటివన్నీ కామన్ అని అంటున్నారు.