pushpa-2: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ.. 14 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?(పోస్టర్)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్‌ విజయం సాధించింది.

Update: 2024-12-20 09:23 GMT

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్‌ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదల అయి 15 రోజులు కావొస్తున్నా కలెక్షన్ల విషయంలో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.

తొలి రోజు నుంచే థియేట‌ర్ల వ‌ద్ద రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్లు రాబ‌డుతోన్న పుష్ప సినిమా.. నిన్నటితో విడుద‌లై 14 రోజులు పూర్తి చేసుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌ద్నాలుగు రోజుల్లో రూ.1508 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. దీంతో భారతీయ బాక్సాఫీస్ చరిత్రలో అతి తక్కువ టైం లో రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ టీమ్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన బన్నీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News