Pushpa 2: నా పేరు కావేరి అని పెట్టడానికి కారణం అదే.. పుష్ప చెల్లెలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’.

Update: 2024-12-19 02:48 GMT

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్‌ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదల అయి 14 రోజులు కావొస్తున్నా కలెక్షన్ల విషయంలో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాలో జాతర సీన్ రావడానికి కారణమైన కావేరి అలియాస్ పావని కరణమ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పావని అసలు సుకుమార్ తన పేరు కావేరి అని  పెట్టడానికి గల కారణాలు ఏంటో చెబుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి జాతర సీన్ షూటింగ్ చేసే వరకు అందరూ నన్ను పావని అనే పిలిచేవారు. అప్పటి వరకు కూడా నా పాత్రకు పేరు పెట్టలేదు. పావనినే పాత్ర పేరు అనుకున్నారు. సుకుమార్ సార్ కూడా పావని అనే పిలిచేవారు. అయితే జాతర షూటింగ్ సమయంలో పావనినా నీ పేరు అంటే.. అది నా ఒరిజినల్ పేరు.. పాత్ర పేరు అని చెప్పా.

వెంటనే నీ పాత్రకు నామకరణం చేస్తున్నాను. కావేరి అని అన్నారు. దాని వెనుక అర్థం కూడా ఉంది. కావేరి నది.. అటు తమిళనాడును ఇటు కర్ణాటకను కలుపుతుంది. అలాగే ఇక్కడ నేను అటు పుష్ప కుటుంబాన్ని, ఇటు మా కుటుంబాన్ని కలుపుతాను అని సింబాలిక్‌గా ఆ పేరు పెట్టారు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. సుకుమార్ అనాలసిస్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News