పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. ‘OG’ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌లో ఓజీ(OG Movie) ఒకటి.

Update: 2024-10-15 16:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌లో ఓజీ(OG Movie) ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్(Director Sujith) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారు. పంజా సినిమా తర్వాత పవన్ కల్యాణ్ ఓజీ పాత్రతో వస్తుండటంతో ఫ్యా్న్స్‌ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 70 శాతానికి పైగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. తాజాగా.. మిగిలిన షూటింగ్‌పై ఓజీ చిత్రబృందం అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. యాక్టర్స్‌కు సీన్లు వివరిస్తున్న డైరెక్టర్ సుజిత్ ఫొటోను పంచుకున్నారు. త్వరలోనే పవన్ కల్యాణ్ షూటింగ్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు. దీంతో లైక్స్, రీట్వీట్స్, కామెంట్లతో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఓజీ చిత్రంలో బాలీవుడ్ నటుడు హిమ్రాన్ హష్మి కీలక పాత్రలో నటిస్తున్నారు. తమిళ నటి ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.



Similar News