Ustad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్..

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బిజీబిజీగా ఉన్నారు. దీంతో అతని చేతిలో మిగిలిపోయిన మూడు సినిమాల కోసం అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-08-30 08:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బిజీబిజీగా ఉన్నారు. దీంతో అతని చేతిలో మిగిలిపోయిన మూడు సినిమాల కోసం అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడున్న పొలిటికల్ బిజీలో వాటికి ఎలాగైనా డేట్స్ ఇచ్చి పూర్తి చేసేయాలని పవన్ చూస్తున్నారు.అయితే మొదట ఉస్తాద్ భగత్ సింగ్‌కు డేట్స్ ఇవ్వబోతున్నారని, సెప్టెంబర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ జరగనుందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై దీనిపై నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు.

తాజాగా నిర్మాత రవిశంకర్ మత్తు వదలరా 2 టీజర్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. అక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. “ఇటీవలే మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసాము. ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ కొన్ని వారాల్లో మొదలుపెడతాము. మొత్తం షూట్ జనవరి 2025 కల్లా పూర్తి చేసేస్తాము. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు నాడు ఆల్రెడీ షూట్ చేసిన దాని నుంచి ఏదో ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ఫ్యాన్స్‌కి ఇస్తాము” అని తెలిపారు. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా సెప్టెంబర్‌లో పవన్ కళ్యాణ్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు కాబట్టి వచ్చే సంవత్సరమే సినిమాలు రిలీజ్ అవుతాయని అంతా భావిస్తున్నారు.

(video link credits to suresh pro X account)


Similar News