Pawan Kalyan: పుష్ప-2, సలార్ కలెక్షన్లపై పవన్ కల్యాణ్ కామెంట్స్
అల్లు అర్జున్(Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన పుష్ప-2(Pushpa-2), ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో నటించిన సలార్(Salaar) సినిమాల కలెక్షన్లపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్(Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన పుష్ప-2(Pushpa-2), ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో నటించిన సలార్(Salaar) సినిమాల కలెక్షన్లపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మంగళగిరిలోని ఆయన కార్యాయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచినప్పుడు రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడంలో ఆశ్చర్యం లేదు.
సలార్, పుష్ప-2 సినిమాలకు అందుకే ఆ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అంచనాలు ఎక్కువగా ఉన్న సినిమాలకు ఒక రోజు అటు ఇటు అయినా తప్పకుండా అభిమానులు థియేటర్‌కు వస్తారు’ అని పవన్ కల్యాణ్ అన్నారు. అనంతరం అల్లు అర్జున్ అంశంలో గోటితో పొయ్యే అంశానికి గొడ్డలి దాకా తీసుకొచ్చారన్నారని అభిప్రాయపడ్డారు. పుష్ప2 సినిమా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా వైసీపీ నేతల్లా వ్యవహరించలేదన్నారు. టికెట్ల ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇచ్చారని గుర్తుచేశారు.
Read More ...
రేవంత్ రెడ్డిని గొప్పనాయకుడన్న పవన్ కల్యాణ్.. బండి సంజయ్ రియాక్షన్ ఇదే!