Pawan Kalyan: గేమ్ చేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు (వీడియో)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), శంకర్ కాంబోలో రాబోతున్న మూవీ ‘గేమ్ చేంజర్’(Game Changer).
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), శంకర్ కాంబోలో రాబోతున్న మూవీ ‘గేమ్ చేంజర్’(Game Changer). ఇందులో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్, ఎస్ జే సూర్య(S.J. Surya) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే దీనికి తమన్(Thaman) సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమాకు దిల్ రాజు(Dil Raju) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇది భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇటీవల గేమ్ చేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్(Pre-release event) అమెరికాలో జరిగిన విషయం తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా కూడా ఓ ఈవెంట్ జరబోతున్నట్లు దానికి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, దీనిపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. విజయవాడలో రామ్ చరణ్(Ram Charan) 256 అడుగులతో ఏర్పాటు చేసిన కటౌట్ లాంచ్ చేశారు. ఈ వేడుకలో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘మన డిప్యూటీ సీఎంను కలవడానికి వచ్చాను.
అమెరికాలో ఈవెంట్ చేశాం గ్రాండ్ సక్సెస్ అయింది. మన డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ఈవెంట్ చేయాలని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇచ్చే డేట్‌ను బట్టి ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేసుకుందామనేది డిసైడ్ అవుతుంది. కానీ ఈవెంట్ మాత్రం మామూలుగా ఉండకూడదు. ఓ చరిత్ర క్రియేట్ చేయాలి’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.