ఓర్ని ఇది డ్యాన్సా.. సీనియర్ హీరోను అవమానించేలా ఇలా చేయడం ఎంతటి దారుణం అంటూ నెట్టింట ట్రోల్స్

యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-09-25 04:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఫస్ట్ మూవీతోనే తన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిని చేసుకుంటూ ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. కానీ, ఈ అమ్మడుకు హిట్స్ కంటే ప్లాప్సే ఎక్కువ ఎదురయ్యాయి. దీంతో సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చిన ఈ భామ మళ్లీ తెలుగులో నితిన్, రవితేజ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.. అలాగే ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీలో కూడా నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌(Nithin), శ్రీలీల జంటగా వెంకీ కుడుముల(Venkey Kudumula) దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్‌’(Robin Hood). మైత్రీ మూవీస్‌ బ్యానర్‌(Mythri Movie Banner)పై నవీన్‌ యర్నేని(Naveen Yarneni), వై.రవిశంకర్‌(Y.Ravishanker) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలోని ఓ కీలక షెడ్యూల్‌ ఆస్ట్రేలియా(Austrelia)లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో నితిన్‌, శ్రీలీలపై ఓ డ్యూయెట్‌ చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ డ్యాన్స్ షూటింగ్‌లో బ్రేక్ దొరకడంతో ఈ అమ్మడు.. సీనియర్ ఎన్టీఆర్(Senior NTR) హిట్ సాంగ్ అయిన లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం అనే సాంగ్‌కు తన దైన స్టైల్లో స్టెప్పులు వేసింది. ఆ వీడియోలో నితిన్ కూడా ఉన్నాడు. ఆ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ శ్రీలీలను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్‌ను అవమానించేలా శ్రీ లీల ఇలా డ్యాన్స్ చేయడం ఎంతటి దారుణం.. అది కూడా హీరో నితిన్ ముందే పెద్దాయనను ఎక్కిరించేలా డ్యాన్స్ చేయడం ఏంటని ఫ్యాన్స్ మండి పడుతున్నారు.. కాగా ఈ మూవీ డిసెంబర్‌ 20న విడుదలవనుంది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌(Rajendra Prasad), వెన్నెల కిశోర్‌(Vennela Kishore), బ్రహ్మాజీ(Brahmaji) కీలక పాత్రలు పోషిస్తున్నారు.

(video link credits to nithin X account)


Similar News