National Crash: బ్లాక్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తోన్న నేషనల్ క్రష్.. అందరూ నవ్వుకుంటారంటూ పోస్ట్..?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (National Crash Rashmika Mandanna) ప్రస్తుతం సికందర్ చిత్రంలో నటిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (National Crash Rashmika Mandanna) ప్రస్తుతం సికందర్ చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన ఈ అమ్మడు నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్లు విడుదలైన విషయం తెలిసిందే. రీసెంట్ గానే సికందర్ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలై.. భారీ రెస్పాన్స్ అందుకుంది. సల్మాన్ ఖాన్ భారీ యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టానడంలో అతిశయోక్తిలేదు. అలాగే రష్మిక మందన్న, బాలీవుడ్ నటుడి కెమిస్ట్రీ కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.
ఈ మూవీ మార్చి 30 వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయే ఫొటోలు పంచుకుంది. వీటికి ఓ క్యాప్షన్ కూడా జోడించింది. ‘ఆ రోజు సికందర్ ట్రైలర్ లాంచ్ కోసం నేను ఏమి ధరించానో మీకు పూర్తిగా స్పష్టంగా చూపిస్తున్నాను. నా బృందం ఇప్పుడు స్వయంగా నవ్వుకుంటుందని నాకు తెలుసు. ఎందుకంటే వారు లుక్ బాగా వచ్చిందని వారు చాలా సంతోషంగా ఉన్నారు’. అంటూ రష్మిక మందన్న రాసుకొచ్చింది.