Nabha Natesh: ‘స్వయంభూ’లో నభా నటేష్ కొత్త లుక్..!
నిఖిల్ ( Nikhil) హీరోగా మన ముందుకు రాబోతున్న కొత్త సినిమా ‘స్వయంభూ’
దిశ, వెబ్ డెస్క్ : నిఖిల్ ( Nikhil) హీరోగా మన ముందుకు రాబోతున్న కొత్త సినిమా ‘స్వయంభూ’ ( swayambhu ) ఈ మూవీ తన సినీ కెరియర్లో 20వ చిత్రంగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ‘కార్తికేయ 2’ ( Karthikeya 2) తో పెద్ద హిట్ అందుకున్న నిఖిల్ కు మార్కెట్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలోనే రూపొందుతున్న నిఖిల్ లెజండరీ వారియర్ పాత్ర చేయబోతున్నాడు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు
భారీ బడ్జెట్ తో నిర్మాతలు ఎక్కడ తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో సంయుక్త మీనన్, నభా నటేష్ ( Nabha Natesh) హీరోయిన్స్ నటిస్తున్నారు. తాజాగా, ఈ మూవీలో నభా క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ కొత్త పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ ముద్దుగుమ్మ కొత్త పోస్టర్ లో చాలా అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం, ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది.