గత ఏడాదే నా పెళ్లి అయిపోయింది.. ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

‘ఝుమ్మంది నాదం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-12-15 05:50 GMT

దిశ, సినిమా: ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కానీ, ఈ అమ్మడుకు అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ సినిమాలు, సిరీస్‌లు చేస్తూ మెప్పిస్తోంది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు తన ప్రియుడు మథియాస్‌తో ప్రేమలో పడి.. ఈ ఏడాది మార్చి 23న పెళ్లి చేసుకుంది. ఇక అప్పటినుంచి మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాప్సీ మాట్లాడుతూ.. ‘జనానికి ఈ విషయం తెలియదు. గత ఏడాది డిసెంబర్‌లోనే మేం అధికారికంగా పెళ్ళి చేసుకున్నాం. త్వరలోనే మా వివాహ వార్షికోత్సవం వస్తోంది. ఉదయ్‌పూర్‌లో వేడుక చేసుకున్నామంతే’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అవుతూ.. అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News