Mrunal: మై ఫేవరెట్ అంటూ స్టన్నింగ్ ఫొటోలు పంచుకున్న సీతారామం బ్యూటీ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrinal Thakur) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrinal Thakur) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ కేవలం తెలుగులోనే కాకుండా.. మరాఠీ, హిందీ భాషల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకుంటుంది. తెలుగులో సీతారామం (Sitaramam) సినిమాతో ఎంట్రీ.. తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. తర్వాత హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ (The Family Star), కల్కి 2898 వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించి.. జనాల్ని ఆకట్టుకుంది.
అందం, అభినయం, నటనలో మృణాల్ మంచి పేరు సంపాదించుకుంది. వీటితో పాటుగా ఈ భామ జెర్సీ(Jersey),టూఫాన్ (Toofan), లస్ట్ స్టోరీస్ 2, బాట్లా హౌస్, గుమ్రాహ్ (Gumrah), ఆంక్ మిచోలీ, నందర్ గారు నమస్కారం, సురాజ్య (Surajya)వంటి హిందీ, మరాఠీ సినిమాల్లో నటించి అద్భుతమైన నటనతో నెటిజన్లను మెప్పించింది. అలాగే బాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
తూహీహీ అనే సినిమాలో నటించి అటు బాలీవుడ్ ప్రేక్షకుల మెప్పు పొందింది. రవి ఉద్యవార్ (Ravi Udyawar) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధార్థ్ చతుర్వేది ముఖ్యపాత్రలో నటించారు. ఈ మూవీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే మృణాల్ ఠాకూర్ అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
తరచూ తన లేటెస్ట్ లుక్‌తో అభిమానుల్ని అలరిస్తుంటుంది. తాజాగా మృణాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆకట్టుకుంటోన్న ఫొటోలు పంచుకుంది. ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చిన ఈ నటిపై ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫొటోలకు ‘‘దేశీ ట్విస్ట్‌తో క్లాసిక్ ఆకర్షణ.. మై ఫేవరెట్’’ అని జోడించింది. ప్రస్తుతం మృణాల్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Read More..
Shalu Chourasiya: కుర్రాళ్లను కవ్విస్తున్న బ్యూటీ.