Chadalavada Srinivasarao : చిన్న సినిమాలకు ఎక్కువ షో లు ఇవ్వాలి.. సీనియర్ నిర్మాత కామెంట్స్
చిన్న సినిమాలను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు.
దిశ, వెబ్ డెస్క్ : విజయ్ కనిష్క, గరిమ చౌహన్ జంటగా సిఎల్ఎన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణంలో హనుమాన్ దర్శకత్వంలో రానున్న మూవీ ‘కలవరం’ ( Kalavaram). ప్రేమ కథ తో పాటు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. తాజాగా, ఈ మూవీ పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ హాజరయ్యారు.
సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ( Chadalavada Srinivasarao) మాట్లాడుతూ.. " ఈ స్టోరీ విన్నాను. చాలా నచ్చింది. బాలచందర్, భాగ్య రాజా లాంటి క్రియేటివ్ డైరెక్టర్స్ తీయగలిగే మంచి కథ ఇది. ఈ మూవీ పెద్ద విజయం సాధించాలి. ఇప్పటి వరకు చిన్న సినిమాలను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడైన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలి. చిన్న సినిమాలకి షోలు ఎక్కువ ఇవ్వాలి. మినీ థియేటర్లు కట్టాలని " అన్నారు. దీంతో ఈయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
నిర్మాత శోభారాణి మాట్లాడుతూ.. " కలవరం టైటిల్ ఈ మూవీకి బాగా సెట్ అవుతుంది. డైరెక్టర్ హనుమాన్ ఈ మూవీ కోసం చాలా చాలా కష్టపడ్డారు. ఈ మూవీలో 70 మంది ఆర్టిస్టులున్నారు. త్వరలోనే సినిమాకి సంబంధించిన డిటైల్స్ తెలియచేస్తామని" ఆమె తెలిపింది.