సాయి దుర్గా తేజ్‌పై మెగా హీరో సడన్ ట్వీట్.. ఏమి టైమింగ్ రా బాబు అంటూ కామెంట్స్
మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్, డైరెక్టర్ రోహిత్ కూపీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సినిమా ‘సంబరాల ఏటిగట్టు’.
దిశ, సినిమా: మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్, డైరెక్టర్ రోహిత్ కూపీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సినిమా ‘సంబరాల ఏటిగట్టు’. ప్రైమ్ షో బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. 1947 హిస్టరీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగా ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది.
ఇదిలా ఉంటే.. సాయి దుర్గా తేజ్ సినిమాపై చాలా మంది సినీ హీరోలు, అతని ఫ్రెండ్స్ స్పందించారు. ఇందులో భాగంగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా స్పందించారు. సంబరాల ఏటిగట్టు సినిమా గ్లింప్స్‌ను షేర్ చేస్తూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఇక ఈ పోస్ట్‌కు సాయి దుర్గా తేజ్ కూడా రిప్లై ఇచ్చాడు. అయితే అల్లు అర్జున్ విడుదలై బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ మెగా హీరోల పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఏమి టైమింగ్స్‌రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.