అమ్మాయిని చీట్ చేశావ్.. నీ బాగోతం బయటపెట్టనా అంటూ ఆ యాంకర్ పై ఫైర్ అయిన మంచు మనోజ్.. వీడియో
టాలీవుడ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ‘భైరవం’(Bhairavam) సినిమాలో నటిస్తున్నాడు. ఇతనితో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), నారా రోహిత్(Nara Rohith) కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక దీనికి విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీలో ఆనంది(Anandi), అదితి శంకర్(Aditi Shankar), దివ్య పిళ్లై(Divya Pillai) హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అయితే సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ప్రొగ్రామ్‌కు వచ్చారు ఈ ముగ్గురు హీరోలు. అయితే ఇందులో యాంకర్ శివ(Shiva) మైక్ పట్టుకుని మనోజ్‌ను ఓ ప్రశ్న వేస్తాడు. అన్న ఒక ప్రశ్న అంటూ అడగబోతాడు. ఇంతలో మనోజ్ అందుకుని..ఏ రెండు ప్రశ్నకు నువ్వు ఉండవా అంటూ సెటైర్ వేస్తాడు. ఆ తర్వాత శివ ఏదో ప్రశ్న వేస్తాడు. అయితే అది మ్యూట్‌లో పెట్టేశారు. ఇక దానికి మనోజ్ సమాధానం ఇస్తూ.. ‘కావాలనే కాంట్రవర్సీ చేయాలని అనుకుని వచ్చి ఏదో మాట్లాడతారు. ఏ మరి మీ తప్పులను ఎందుకు ప్రశ్నించొద్దు.
నువ్వు ఉండేది పీ ఆర్సీలోనే కదా. అక్కడ ఒక అమ్మాయిని లవ్ పేరుతో చీట్ చేశావ్.. ఆ అమ్మాయి పేరు’ అంటూ ప్రోమోలో చెప్తాడు. అక్కడితో కట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట హల్ చల్ చేస్తుంది. కాగా మనోజ్ శివ పై ఎందుకు అంత ఫైర్ అయ్యాడు..? అలా అయ్యోలా శివ మనోజ్‌ను ఏం ప్రశ్న వేశాడో తెలియాలంటే ఫుల్ ఏపిసొడ్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
Read More..
ఫ్యాన్స్‌కు బంపరాఫర్.. మెగాస్టార్ ఇంట్లో ఉండే ఛాన్స్.. దానికోసం ఏం చేయాలంటే?