ఓ కుటుంబాన్ని బాధపెట్టారు.. మీరంతా క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ మంచు లక్ష్మి సెన్సేషనల్ పోస్ట్
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(Sushant Singh Rajput) తన నివాసంలో సూసైడ్ చేసుకుని మరణించిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(Sushant Singh Rajput) తన నివాసంలో సూసైడ్ చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన చావుకు కారణం ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty)అని ఆమెపై కేసు నమోదు అయింది. అంతేకాకుండా జైలుకి వెళ్లి వచ్చింది. ఇక కొన్నేళ్ల నుంచి ఆమెపై పలు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కేసు విషయంలో కోర్టు విచారించగా.. రియా నిర్ధోషి అని తేలింది. తాజాగా, ఈ విషయంపై మంచు లక్ష్మి(Manchu Lakshmi) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రియాక్ట్ అయింది. ‘‘రియా చక్రవర్తి కుటుంబానికి క్లీన్ చిట్ వచ్చింది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు ముందే తెలుసు.
ఎందుకంటే నిజం ఎంతోకాలం దాగదు. కాస్త ఆలస్యమైనా సరే బయటకు రాక తప్పదు. రియా ఆమె కుటుంబం.. భరించలేని బాధను అనుభవించింది. సమాజం మిమ్మల్ని తప్పని నిందిస్తుంటే మీతో రాక్షసంగా చీల్చి చెండాడారు. అయినా మీరు హుందాగా నిలబడ్డారు. నిజానిజాలు తెలుసుకోకుండా మీపై నోరు పారేసుకున్న వారు ఆత్మవిమర్శ చేసుకుని క్షమాపణలు చెప్పాలి. అన్యాయంగా ఓ కుటుంబాన్ని బాధపెట్టారనే విషయం తెలుసుకుని పశ్చాపపడాలి. రియా నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నీకు మరింత శక్తి చేకూరాలి. ఇది ఒక ఆరంభం మాత్రమే ఇకపై అంతా మంచే జరుగుతుంది. నువ్వు అనుభవిస్తున్న బాధ ఇప్పటికైనా తగ్గుతుందని ఆశిస్తున్నాను’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మి పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మంచు లక్ష్మిని సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు.

