Manchu Lakshmi: ఫ్యామిలీ గొడ‌వ‌లతో.. మంచు ల‌క్ష్మీకి సంబంధం లేదా..? ఇలాంటి పోస్ట్ పెట్టేందేంటని మండిప‌డుతున్న నెటిజ‌న్లు..

మోహన్ బాబు, మ‌నోజ్‌ను ఇంట్లోకి రానివ్వ‌కుండా గేట్లకు తాళాలు వేసి సెక్యూరిటీని పెట్టారు

Update: 2024-12-11 12:03 GMT

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా ఏ ఇంట్లోనైన గొడవలు జరగడం సహజం. అవి నాలుగు గోడలు మధ్యలోనే ఉంటాయి. అంత సామాన్యంగా బయటకు రావు. అయితే, గత రెండు రోజుల నుంచి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుని, తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు ఫ్యామిలీలో  గొడవలు టాలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మోహన్ బాబు, మ‌నోజ్‌ను ఇంట్లోకి రానివ్వ‌కుండా గేట్లకు తాళాలు వేసి సెక్యూరిటీని పెట్టారు. దీంతో, మ‌నోజ్‌ ( Manchu Manoj) గేట్లను బ‌ల‌వంతంగా నెట్టి లోప‌లికి వెళ్ల‌గా.. స్వల్ప గాయాలతో ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చారు.

ప్రస్తుతం, మంచు ఫ్యామిలీలో ఎన్నో గొడవలు జ‌రుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంద‌రి చూపు మంచు ఫ్యామిలీ పైన ప‌డింది. రోజూ ఇక్కడ ఇంత జ‌రుగుతుంటే మంచు ల‌క్ష్మీ ( Manchu Lakshmi) ఎక్కడ ఉందంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే, తాజాగా, తన సోషల్ మీడియాలో కూతురి వీడియోను పోస్ట్ చేసి " పీస్ " అనే క్యాప్షన్ ను రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు మండిప‌డుతున్నారు. తండ్రీ, అన్న‌ద‌మ్ములు కొట్టుకునేంత వరకు వెళ్తే.. వారిని కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించకుండా ఇలా ఇన్‌స్టాలో బీజీగా ఉందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Full View

Read More...

Mohan Babu : మోహన్‌బాబుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్



Tags:    

Similar News