‘కన్నప్ప’ నుంచి మహదేవ శాస్త్రి గ్లింప్స్ రిలీజ్.. 'కనుబొమ్మ ముడిచితే ఉగ్ర శాస్త్రి అంటూ ఉగ్రరూపం చూపించాడుగా

హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న మూవీని.. అవా ఎంటర్‌టైన్మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు.

Update: 2025-03-20 02:57 GMT
‘కన్నప్ప’ నుంచి మహదేవ శాస్త్రి గ్లింప్స్ రిలీజ్.. కనుబొమ్మ ముడిచితే ఉగ్ర శాస్త్రి అంటూ ఉగ్రరూపం చూపించాడుగా
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న మూవీని.. అవా ఎంటర్‌టైన్మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్, శరత్ కుమార్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఈ మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఇందులో భాగంగా బుధవారం డా.ఎం.మోహన్​బాబు పుట్టినరోజు సందర్భంగా 'కన్నప్ప' మూవీ టీమ్‌ ఓ స్పెషల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో మోహన్​బాబు పోషించిన 'మహదేవ శాస్త్రి' పాత్రను పరిచయం చేసింది.

ఇక గ్లింప్స్‌ను గమనించినట్లయితే.. 'ఢమ ఢమ విశ్వలింగ, దిమి దిమి విష్ఫు లింగ' అనే పాటతో గ్లింప్స్‌ మొదలవుతుంది. ఈ పాటను పాపులర్‌ సింగర్‌ శంకర్‌ మహదేవన్‌ పాడగా.. సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించారు. ఇక పాట వింటుంటే మహదేవ శాస్త్రి పాత్ర ఎలా ఉంటుంది? అతడికి శివుడిపై ఎంత భక్తి ఉందో అర్థమైపోతుంది. 'కనుబొమ్మ ముడిచితే ఉగ్ర శాస్త్రి, కంగువ తెరచితే రుద్ర శాస్త్రి' వంటి లైన్లు పాత్ర ఎంత శక్తివంతంగా ఉంటుందో చెబుతున్నాయి. అయితే గ్లింప్స్‌లో మోహన్​బాబు మేకప్‌ వేసుకోవడం, సినిమా షూటింగ్‌ దృశ్యాలు కూడా కనిపించాయి. ఫైనల్‌గా పొడవైన జుట్టు, నుదుటిన విభూది, కాషాయ వస్త్రాలు, జపమాలలు ధరించి మహదేవ శాస్త్రి నడిచొస్తున్న దృశ్యాలు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Read More..

గెట్ రెడీ బాయ్స్.. ‘రెట్రో నుంచి బిగ్ అప్డేట్ వచ్చేస్తుందంటూ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్  


Full View


Tags:    

Similar News