Sarangapani Jathakam : సారంగపాణి జాతకం నుంచి మరో లిరికల్ సాంగ్ విడుదల..!
ప్రియదర్శి నటిస్తోన్న మరో కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సారంగపాణి జాతకం’.
దిశ, వెబ్‌డెస్క్: ప్రియదర్శి(Priyadarshi) నటిస్తోన్న మరో కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సారంగపాణి జాతకం’(Sarangapani horoscope). ఈ సినిమాకు అష్టా చెమ్మా(Ashta chemma), జెంటిల్‌మెన్(Gentlemen), సమ్మోహనం(Sammohanam), వీ చిత్రాల దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి(Mohankrishna Indraganti) దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ పతాకం(Sridevi Movies Patakam)పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శకి జంటగా రూపా కొడువాయుర్(Rupa Koduvayur) కథానాయికగా నటిస్తోంది.
ఈ నెల (డిసెంబరు) 20 వ తేదీన సారంగపాణి జాతకం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ విడుదల చేశారు మేకర్స్. సారంగపాణి జాతకం నుంచి ‘సంచారి సంచారి ఎటువైపో నీ దారి’(‘Sanchari sanchari eṭuvaipo ni dari) అంటూ సాగే లిరికల్‌ను రిలీజ్ చేసి.. ప్రేక్షకుల్లో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ‘ ఉల్లా ఉల్లా ఉల్లా ఉల్లాస కల్లోలం.. గల్లా గల్లా గంతులాడింది భూగోళం’ పాట విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.