Kora: హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ‘కోర’ టీజర్..

కన్నడ నటుడు సునామీ కిట్టి (Sunami Kitti) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కోర’ (Kora).

Update: 2025-01-04 12:27 GMT

దిశ, సినిమా: కన్నడ నటుడు సునామీ కిట్టి (Sunami Kitti) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కోర’ (Kora). యాక్షన్ అండ్ పీరియాడిక్ (Action and Periodic) డ్రామాగా తెరకెక్కతున్న ఈ సినిమాను ఒరాటశ్రీ (Oratashree) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో చరిష్మా, పి.మూర్తి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్, రత్నమ్మ మూవీస్ బ్యానర్లపై డా.ఎ.బి.నందిని, ఎ.ఎన్.బాలాజీ, పి.మూర్తి నిర్మిస్తున్న ‘కోర’ నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు (Posters), గ్లింప్స్ (Glimpses) సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి.

ఇందులో భాగంగా.. తాజాగా స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఈ మూవీ టీజర్‌ (Teaser)ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేస్తూ టీంకు అభినందనలు తెలిపారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లతో సరైన పాన్ ఇండియన్ మూవీలా కోర తెరకెక్కినట్లు అర్థం అవుతోంది. టీజర్‌లో చూపించిన విజువల్స్, కెమెరా వర్క్, ఆర్ఆర్, యాక్షన్ సీక్వెన్స్‌ మాస్ ఆడియెన్స్‌కు ఐ ఫీస్ట్‌లా ఉంటుంది. కాగా.. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు చెప్పుకొచ్చారు మేకర్స్.

Full View


Tags:    

Similar News