Keerthy Suresh: భర్త కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్న కీర్తి సురేష్ ..?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) ఇటీవల తన ప్రేమ గురించి అధికారిక ప్రకటన విడుదల చేసి కుర్రాళ్లకు షాకిచ్చిన విషయం తెలిసిందే.
దిశ, సినిమా: నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) ఇటీవల తన ప్రేమ గురించి అధికారిక ప్రకటన విడుదల చేసి కుర్రాళ్లకు షాకిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. డిసెంబర్ 14న ఆమె గోవాలో తన ప్రియుడు ఆంటోనీ తటిల్(Antony Thattil)ను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతిలో కూడా పెళ్లి(Wedding) చేసుకుంది. ఇక వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారాయి. దీంతో ఈ కొత్త జంట హనీమూన్‌కు వెళ్తారని అంతా భావించారు.
ఈ క్రమంలోనే.. కీర్తి సురేష్ ‘బేబీ జాన్’(Baby John) ప్రమోషన్స్‌లో తాళితో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లైన వారానికే ఆమె అలా చేయడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, కీర్తి సురేష్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె తన భర్త కోసం ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలని చూస్తుందట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతూ ఏడాది పాటేనా లేక సమంతలా మొత్తానికి దూరం అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.