కూతుర్లు విడాకులు తీసుకున్నా చిరంజీవి, నాగబాబు హ్యాపీగా ఉండడానికి కారణం అదేనా..?

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా విడాకులు తీసుకున్నారు. ఇటీవల కాలంలోపెళ్లి, విడాకులు అనేవి సమాజంలో కామన్ అయిపోయాయి.

Update: 2024-01-18 05:16 GMT

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా విడాకులు తీసుకున్నారు. ఇటీవల కాలంలో పెళ్లి, విడాకులు అనేవి సమాజంలో కామన్ అయిపోయాయి. మరీ ముఖ్యంగా విడాకులు అనగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు మెగా ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో చిరంజీవి కూతురు శ్రీజ భర్తతో విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అలాగే నాగబాబు కూతురు నిహారిక భర్తతో విడిపోయినట్లు ఇటీవల ఓ పోస్ట్‌తో అందరికీ షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి ఒంటరిగా లైఫ్ ఎంజాయ్ చేస్తూనే తనకు నచ్చినట్లుగా ఉంటుంది. అయితే వీరిద్దరి విడాకుల విషయంలో చిరంజీవి, నాగబాబు ఏమాత్రం బాధపడలేదన్న విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

తన కూతురు మెంటల్ టార్చర్ భరించడం కన్నా తన లైఫ్ తన ఎంజాయ్ చేసుకోవడమే కరెక్ట్ అంటూ కూతురికి సపోర్ట్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక నాగబాబు కూడా తన కూతురికి ఓ బ్యానర్ నిర్మించి నిర్మాతగా ఎదగడానికి తనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. కూతుర్లు జీవితంలో హ్యాపీ గా ఉండడమే కావాలని భర్తలతో విడిపోయినా కానీ మెగా బ్రదర్స్ అండగా నిలుస్తున్నారు. దీనికి కారణం చిరంజీవికి, నాగబాబుకు కూతుర్లపై ఉన్న ప్రేమనే కారణం. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం చిరు, నాగబాబులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రులకు కూతుర్ల సంతోషం కంటే ఏది ముఖ్యం కాదని వీరిద్దరూ నిరూపించారని అనుకుంటున్నారు. 

Tags:    

Similar News