వీరమల్లు చెబితే 'మాట వినాలి'.. HHVM ఫస్ట్ సింగిల్ విడుదల (వీడియో)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu).

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu). ఇందులో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) విలన్‌గా కనిపించనున్నాడు. అయితే దీనిని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏ ఎమ్ రత్నం(A.M. Ratnam) నిర్మిస్తున్నారు. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌తో దూసుకుపోతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు భాషల్లో స్వయంగా పవన్ కళ్యాణే పాట పాడటంపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సమ్మర్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.