శివాజీ పాత్ర ఆ స్టార్ హీరో చేస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది: పరుచూరి గోపాలకృష్ణ(వీడియో)

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’(Chhaava).

Update: 2025-02-21 07:46 GMT
శివాజీ పాత్ర ఆ స్టార్ హీరో చేస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది: పరుచూరి గోపాలకృష్ణ(వీడియో)
  • whatsapp icon

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’(Chhaava). దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. అయితే ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్(Sambhaji Maharaj) జీవిత చరిత్ర ఆధారంగా వచ్చి బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఫిబ్రవరి 14న థియేటర్స్‌లోకవ వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచి అందరినీ మంత్రముగ్దులను చేయడంతో పాటు భారీ కలెక్షన్లు రాబడుతూ సంచలనం సృష్టిస్తోంది.

ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty)ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా ‘ది ప్రైడ్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమాను తీసుకువస్తున్నారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక గతంలో చంద్రహాస్ నంబర్-1 సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ శివాజీ వేషం వేసి కనిపించగా.. ఆ సినిమా కూడా హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఛత్రపతి శివాజీగా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)ను చూడాలని ఆయన అభిమానులంతా కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘సూపర్ స్టార్ కృష్ణ నటించిలేని ఒక పాత్ర ఇప్పటికీ అలాగే మిగిలిపోయింది. అదీ ఛత్రపతి శివాజీ. నేను మహేష్ బాబును ఆ పాత్రలో నటించమని కోరుతున్నాను. మీరు కూడా ఆయనను రిక్వెస్ట్ చేయండి. శివాజీ గెటప్‌లో ఆయన అద్భుతంగా సెట్ అవుతారు. శివాజీ పాత్ర మహేష్ చేస్తే భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడంతో పాటు చరిత్రలో నిలిచిపోతుంది. ఛత్రపతి శివాజీగా మహేష్ కనిపించాలని నేను ఆయనను అడుగుతున్నాను. నాకు ఆ పాత్రలో ఆయనను చూడాలని కోరికగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Tags:    

Similar News

Vaishnavi Chaitanya