టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. యంగ్ ప్రొడ్యుసర్, అల్లు అర్జున్ ఫ్రెండ్ కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమ(Tollywood)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మిత్రుడు, ప్రముఖ సినీ నిర్మాత కేదార్ సెలగంశెట్టి(Kedar Selagamsetty) కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమ(Tollywood)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మిత్రుడు, ప్రముఖ సినీ నిర్మాత కేదార్ సెలగంశెట్టి(Kedar Selagamsetty) కన్నుమూశారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ఆయన.. అక్కడే తుదిశ్వాస విడిచినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇటీవల విజయ్ దేవరకొండ సోదరుడు.. ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) నటించిన ‘గం.. గం.. గణేశా’ చిత్రానికి కేదార్ సెలగంశెట్టి నిర్మాతగా వ్యవహరించారు. అల్లు అర్జున్(Allu Arjun)తో పాటు నిర్మాత బన్నీ వాసుకు కూడా కేదార్ అత్యంత సన్నిహితుడు.
గతంలోనూ ముత్తయ్య అనే సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) చేయబోతున్న మూవీ కూడా కేదార్ బ్యానర్‌లో తెరకెక్కాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన అనూహ్యంగా మృతిచెందడం టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది. కేదార్ మృతికి కారణాలు తెలియరాలేదు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? దుబాయికి ఎందుకు వెళ్లారు? అనే విషయాలు తెలియాల్సి ఉన్నది.