అలాంటి వాటి మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు.. తాప్సీ పన్ను ఇంట్రెస్టింగ్ కామెంట్స్

‘ఝుమ్మంది నాదం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-12-30 08:57 GMT

దిశ, సినిమా: ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కానీ, ఈ అమ్మడుకు అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ సినిమాలు, సిరీస్‌లు చేస్తూ మెప్పిస్తోంది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు తన ప్రియుడు మథియాస్‌తో ప్రేమలో పడి.. ఈ ఏడాది మార్చి 23న పెళ్లి చేసుకుంది. ఇక అప్పటినుంచి మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘చాలా మంది ప్రముఖులు.. పెద్ద స్టార్లకు మెసేజ్‌లు పెట్టడం లాంటివి చేయడం నేర్చుకో అని నాతో అన్నారు. అప్పుడు నేను ఎందుకు అని అడిగితే వారు నువ్వు అలా చేయడం వల్ల స్టార్ నైట్స్‌కీ, బర్త్ డే పార్టీలకు అటెండ్ అయ్యే చాన్స్ వస్తుందని, దీనివల్ల నువ్వు త్వరగా ఎదగవచ్చు అని సలహాలు ఇచ్చారు. అయితే అంత కష్టపడి ఇంత దూరం వచ్చిన నేను అలా నైట్ పార్టీలకు వెళ్లాలని అనుకోవడం లేదని, పది తర్వాత జరిగే ఎలాంటి పార్టీల మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని వారితో చెప్పాను’ అంటూ తాప్సీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News