అల్లు అర్జున్ ఎఫెక్ట్.. మరో స్టార్ హీరోకు HYD పోలీసుల షాక్
అక్కినేని యువ హీరో నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) ప్రధాన పాత్రల్లో నటించిన తండేల్ మూవీ(Thandel Movie) ఫిబ్రవరి 7వ తేదీన గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని యువ హీరో నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) ప్రధాన పాత్రల్లో నటించిన తండేల్ మూవీ(Thandel Movie) ఫిబ్రవరి 7వ తేదీన గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తొలిసారి నాగచైతన్య ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. చందు మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్‌పై అల్లు అరవింద్, బన్నివాస్ నిర్మించారు. విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్‌లో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్(Thandel Movie Prerelease event) ప్లాన్ చేశారు. ఈ ఫంక్షన్‌కు గెస్ట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పిలిచారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా తండేల్ చిత్రబృందానికి హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు.
మరోవైపు ఇవాళ సాయంత్రమే నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు పద్మ భూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి హైదరాబాద్‌లోని వారి ఫామ్ హౌస్లో ఇండస్ట్రీ పెద్దలకు, కుటుంబీకులకు పార్టీ ఇవ్వబోతున్నారు. దీంతో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకేరోజు రెండు ఈవెంట్లకు పోలీసులను సర్దుబాటు చేయడం కుదరకపోవడంతో తండేల్ ఫంక్షన్(Tandel Function)కు అనుమతి నిరాకరించారు. దీంతో చేసేదేంలేక తండేల్ ఈవెంట్ వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆదివారం ఆ వేడుకను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ‘‘ది ఐకానిక్ తండేల్ జాతరను రేపటికి వాయిదా వేస్తున్నాం. ఈవెంట్ భారీ స్థాయిలో ఉంటుంది. ఈ పాలి యాట గురితప్పేదే లేదేస్’’ అని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. వేదిక వివరాలు ఇంకా వెల్లడించలేదు.
అయితే.. అల్లు అర్జున్(Allu Arjun) వస్తున్న నేపథ్యంలో అభిమానులు అక్కడకు భారీ వచ్చే అవకాశం ఉందని.. అందుకే మరోసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం.
పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోడంతో అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా రానున్న తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా
— Telugu Scribe (@TeluguScribe) February 1, 2025
హైదరాబాద్‌లో ఈరోజు సాయంత్రం జరగాల్సిన తండేల్ ఈవెంట్‌కు ఇవ్వాళ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆదివారం సాయంత్రానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన చిత్ర బృందం
ఈరోజు… pic.twitter.com/8Hu59pF5Y1