Good news: సమంత ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త.. భాగస్వామి-పిల్లల గురించి సెన్సేషనల్ స్టోరీ

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2024-12-11 06:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. తరచూ సోషల్ మీడియాలో నిలిచే స్టార్ సెలబ్రిటీల్లో ఈ నటి ఒకరు. ఎప్పుడూ ఏదో ఒక వార్తలో నెట్టింట హైలెట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి(Myositis disease) నుంచి కోలుకుంటోన్న ఈ నటి మళ్లీ సినిమాలు(Movies), వెబ్ సిరీస్‌(Web series)ల బాట పట్టింది. విజయం దిశగా అడుగులు వేస్తోన్న క్రమంలోనే సామ్‌కు మరో దెబ్బ తగిలింది. రీసెంట్‌గా తన తండ్రి జోసెఫ్ ప్రభు (Joseph Prabhu)మరణించారు.

ఇక జీవితంలో మిమ్మల్ని కలవలేను డాడీ అంటూ సమంత ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఎమోషనల్ పోస్ట్(Emotional post) పెట్టింది. దీంతో సామ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికన కామెంట్ల రూపంలో సంతాపం వ్యక్తం చేశారు. ఇకపోతే తాజాగా ఈ హీరోయిన్ ఇన్‌స్టా స్టోరీతో అభిమానుల్లో ఉత్సాహం నింపింది. సమంత రాశి వచ్చే ఏడాది (2025) నాటికి ఎలా ఉంటుందో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ బ్యూటీ రాశి(Horoscope)లో ఏం రాసిందో అదే జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించడం విశేషం.

సామ్ షేర్ చేసిన పోస్ట్‌లో.. వృషభ(VRUSHABHA), కన్య(KANYA) మకర(MAKARA) రాశి వారు వచ్చే సంవత్సరం.. వృత్తి పరంగా మెరుగుపడతారని రాసి ఉంది. అలాగే ఎన్నో ఏళ్ల నుంచి మీకున్న గోల్స్ నెరవేరుతాయని, ఫైనాన్షియల్‌(Financial)గా దూసుకుపోతారని, మెంటల్‌(Mental), ఫిజికల్‌(Physical)గా స్ట్రాంగ్‌గా ఉంటారని, మరింత ప్రేమ(love), నమ్మకం(trust) అందించే భాగస్వామి మీ లైఫ్‌లోకి వస్తారని, పిల్లల్ని పొందుతారని, ఆదాయ మార్గాలు(Income Streams) పెరుగుతాయని, అవకాశాలు బాగా వస్తాయని సామ్ పోస్ట్ లో రాసుంది. ప్రెజెంట్ ఈ బ్యూటిపుల్ అగ్ర తార పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వగా.. సామ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.  

Read More...

Shobhitha: పెళ్లిలో ఆ స్టార్ హీరో సూపర్ హిట్ సాంగ్‌కు కిర్రాక్ స్టెప్పులు వేసిన అక్కినేని కోడలు.. (వీడియో)




 

Tags:    

Similar News